ఏపీలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పలువురిపై దాడులకు దిగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. నలుగురిపై దాడి చేశాయి. గాయపడిన వారిలో ఓ బాలుడు, మహిళలు ఉన్నారు. వీరి కాళ్లు, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.