వేర్వేరు ప్రమాదాలు.. 16 మంది దుర్మరణం

57చూసినవారు
వేర్వేరు ప్రమాదాలు.. 16 మంది దుర్మరణం
పాకిస్థాన్‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 16 మంది దుర్మరణం పాలయ్యారు. సింధ్‌ ప్రావిన్స్‌లోని ఖైర్పూర్‌ సమీపంలోని రాణిపుర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మంది మృతిచెందగా.. 35 మందికి గాయాలయ్యాయి. బురేవాలా నుంచి వస్తున్న బస్సు రిక్షాను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అలాగే, షహీద్‌ బెనజీరాబాద్‌ జిల్లాలోని ఖాజీ అహ్మద్‌ పట్టణం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌‌కు ప్రమాదం జరగడంతో ఐదుగురు మృతిచెందగా.. 10 మంది గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్