రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. 2025 జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీ రాజధాని అమరావతిలో జరనున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ఛీఫ్ గెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు, చరణ్ రెక్వెస్ట్ మేరకు పవన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై.. నాలుగు మాటలు మాట్లాడేందుకు ఓకే అన్నట్లు సమాచారం.