ఏపీలోని కాకినాడలో పట్టపగలు ఓ దొంగ హల్‌చల్ చేశాడు. నగరంలోని ఓ బంగారం షోరూమ్‌లోకి చొరబడిన దొంగ తుపాకీతో ఉద్యోగిని బెదిరించి ఆభరణాలు దోచుకెళ్లాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి అటవీశాఖ కార్యాలయం సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దొంగ వద్ద నుంచి తుపాకీతో పాటు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగను కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.