కొందరు టీచర్లు చెప్పే బోధనా పద్ధతి విద్యార్థులకు బోరింగ్ ఫీలింగ్ కలగుకుండా ఆ సబ్జెక్ట్‌పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అచ్చం అలానే ఓ ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు రసాయన శాస్త్రంలోని ఓ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థం కావాలని ఎంతలా కష్టపడ్డాడో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే. కెమిస్ట్రీలోని చిరాలటీ కాన్సెప్ట్‌ని విద్యార్థులకు అర్థమయ్యేలా తన శరీర భంగిమలతో క్లియర్‌గా వివరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.