AP: ఓ బ్యాంకులో జరిగిన దొంగతనానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుపతి రూరల్ మండలం రేణిగుంట రోడ్డులోని బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు. క్యాషియర్ దగ్గరకు వెళ్లి మెడపై కత్తి పెట్టి బ్యాగులో డబ్బులు వేయాలని బెదిరించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.