తెలంగాణలో బీఆర్ఎస్ పాలనపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు ఆమెకు ఓ లేఖ రాశారు. దేశంలో గత 65 ఏళ్లలో 14 ప్రధానులు కలిసి రూ. 56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. బీజేపీ ప్రభుత్వం కేవలం 10 ఏళ్లలో రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన విషయాన్ని నిర్మలా సీతారామన్‌కు గుర్తు చేశారు.