రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాను పెంచడం పట్ల క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీ విధానంలో భాగంగా సీఎం చంద్రబాబు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు 2 నుంచి 3 శాతానికి పెంచుతు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఇంటర్నేషనల్, నేషనల్, రాష్ట్ర స్థాయి క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇవ్వనున్న ప్రోత్సాహక బహుమతులు సైతం భారీగా పెంచడాన్ని హర్షిస్తూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.