మూడు దేశాల పర్యటనలో భాగంగా శనివారం నైజీరియాలోని అబుజా నగరానికి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ మంత్రి నైసోమ్ ఎజెన్వో వైక్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నైజీరియాలో ఉన్న భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో సమావేశమై, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. అనంతరం, జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్తారు.