రాష్ట్ర విద్యాశాఖలో పథకాలకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయడం అభినందనీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యుత్ కానుకకు రాధాకృష్ణన్, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేర్లు పెట్టడం, అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం హర్షణీయమన్నారు. గత ప్రభుత్వం పథకాలకు తమ పేర్లు పెట్టుకున్నారని పవన్ విమర్శించారు.