సిరియా టార్టస్‌ ప్రావిన్స్‌లో ఘర్షణలు.. 17 మంది మృతి

83చూసినవారు
సిరియా టార్టస్‌ ప్రావిన్స్‌లో ఘర్షణలు.. 17 మంది మృతి
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ ప్రభుత్వంలోని ఓ అధికారిని అరెస్టు చేసేందుకు రెబల్స్‌ ప్రయత్నించగా.. ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతిచెందారు. ‘అసద్‌ ప్రభుత్వంలో సైనిక న్యాయ విభాగం డైరెక్టర్‌గా ఓ వ్యక్తి బాధ్యతలు నిర్వహించాడు. ఆ సమయంలో వేలమంది ఖైదీలకు అన్యాయంగా మరణశిక్ష విధించాడనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి’ అని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్