గుంటూరు శ్రీనివాసరావుపేటలో నివాసముండే టీ. దుర్గ భవానీ ఇంటికి ఆమె మామ వెంకటేశ్వర్లు వచ్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతమంది బంధువులు దుర్గాభవాని ఇంటికి వచ్చి వెంకటేశ్వర్లు భార్యపై దాడి చేయబోగా అడ్డు వచ్చినా కళ్యాణ్ ను తిరుపతయ్య అనే వ్యక్తి కర్రతో కొట్టాడు. ఈ ఘటనపై దుర్గా భవాని నగర పాలెం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.