గుంటూరులో అన్న క్యాంటీన్లను శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని పల్నాడు బస్టాండ్, నల్లచెరువు రిజర్వాయర్, అడవితక్కెళ్లపాడు డీటీసీ ఆఫీస్, చుట్టుగుంట, మిర్చియార్డ్, తూర్పు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ సర్కిల్, నగరాలలోని ఐడీ హాస్పిటల్ వద్ద క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.