ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, లాం ఫారం ఆధ్వర్యంలో శుక్రవారం తాడికొండ మండలం నిడిముక్కల గ్రామంలో పత్తి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పత్తి పంట తీసివేసిన అనంతరం పంట అవశేషాలను పశువులు లేదా గొర్రెల మేపుకు వదిలి అనంతరం మిగిలిన అవశేషాలను సమూలంగా నాశనం చేస్తే పంటలో నిద్రావస్థలో ఉండే పురుగుల అవశేషాలను సమూలంగా నాశనం చేసుకుంటే రాబోయే పంట కాలంలో మంచి పంట తీసుకోవచ్చని ప్రధాన శాస్త్రవేత్త డా. ఎం. సుధారాణి సూచించారు. ఈ కార్యక్రమంలో మల్చర్ ద్వారా పంట అవశేషాలను పూర్తిగా నాశనం చేసే విధానాన్ని క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.