తుళ్లూరు మండలం పరిధి శివారులోని తానాపతి చెరువు వద్ద ఉన్న ఇరుకు మలుపు ప్రమాదాలకు కేంద్రంగా ఉందని మండల ప్రజలు అంటున్నారు. గుంటూరు, తుళ్లూరు, శాఖమూరు గ్రామాల ప్రయాణికులు తరచు ఈ మలుపు వద్ద ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక్కడ సరైన సూచికలు లేకపోవడం కూడా కారణమని ప్రజలు భావిస్తున్నారు. కొత్తవారు ఈ మలుపు వద్ద ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.