క్రేన్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

1545చూసినవారు
తెనాలిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డుపై వెళ్తున్న క్రేన్ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్రేన్ సహా ఆర్టీసీ బస్సు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి సహా బస్సులోని ఒక ప్రయాణీకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్