అద్దంకి మండలం విప్పర్ల వారి పాలెం గ్రామంలో గురువారం గ్రామంలోని సిసి రోడ్లు, సైడ్ కాల్వలకు సర్పంచ్ బొనిగల శాంతమ్మ శంకుస్థాపన చేశారు. గ్రామంలో 10 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆమె చెప్పారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ సారధ్యంలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉపేంద్ర, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.