బాపట్ల: కాలువలో దూకి యువకుడు ఆత్మహత్యాయత్నం
బాపట్ల మండల పరిధిలోని కర్లపాలెం రహదారిలోని నాగరాజు వద్ద ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం ఉప్పారపాలెంకి చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై నాగరాజు కాలువ వద్ద ఉన్న బ్రిడ్జి వద్దకు వచ్చి ఒక్కసారిగా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న మత్స్య కారులు గమనించి యువకుడిని వెంటనే కాపాడారు. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.