మద్యం దుకాణదారులు సబ్ డివిజన్ పరిధిలో అనధికార మద్యం బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు చేపడతామని బాపట్ల ఎక్సైజ్ సీఐ గీతిక హెచ్చరించారు. మంగళవారం కార్యాలయంలో మద్యం దుకాణాల నిర్వాహకుల సమావేశంలో మాట్లాడారు. బెల్ట్ షాపులు నిర్వహించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని అరెస్టు చేసి షాపు లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎక్సైజ్ ఎస్సై ప్రభుదాస్ పాల్గొన్నారు.