బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురు సోమవారం 108 ఉద్యోగులు ధర్నాను నిర్వహించారు. జీవో నెంబర్ 49 అమలు చేయాలని, 108 సర్వీసులు నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, సర్వీస్ లో పనిచేస్తున్నఉద్యోగులను ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులుగా గుర్తించాలి, రోజుకి మూడు షిఫ్టుల్లో 8గంటల పని విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 24న సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు.