బాపట్ల: ఆర్ అండ్ బి అధికారులతో కలెక్టర్ సమీక్ష

59చూసినవారు
బాపట్ల జిల్లాలో గుంతల మయంగా మారిన ప్రధాన రహదారులను ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరతగతిన మరమ్మత్తులు చేపట్టాలని కలెక్టర్ వెంకట మురళి అధికారులను సూచించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఆయన ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా పనులు ఎలా చేపడుతారని అధికారులను ప్రశ్నించగా అత్యవసర అవసరాల నేపథ్యంలో పనులు చేపట్టవచ్చని ఆయనకు వివరించారు. నిర్దేశించిన పనులను పూర్తి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్