బాపట్ల: బుడా చైర్మన్ సలగలను సన్మానించిన కలెక్టర్

53చూసినవారు
బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ , బాపట్ల తెలుగుదేశం అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు ను శనివారం బాపట్లలో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట మురళి పాల్గొని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం తరఫున తన వంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కలెక్టర్ వెంకట మురళి సలగలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలోపలువురు కలెక్టర్ ను సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్