ఇళ్ళు లేని పేదలకు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని శుక్రవారం బాపట్ల పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పాల్గొని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్ కు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని అందించారు.