బాపట్ల జిల్లా ప్రజలకు జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు మంగళవారం దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దీపావళి రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బాణాసంచా కాల్చుకునే సమయంలో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, కాటన్ దుస్తులు, కళ్ళజోళ్ళు ధరించి, బహిరంగ ప్రదేశాలలో ఎవరికి ఇబ్బంది లేకుండా బాణాసంచా కాల్చుకోవాలని, అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే 101, 08643-224311 కు సంప్రదించాలన్నారు.