బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను పరామర్శించి ఆరోగ్య యోగక్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకొని పార్టీ కార్యకలాపాలలో కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.