బాపట్ల జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం బుధవారం సూర్యలంక సమీపంలోని నగరవనంలో జరిగింది. జిల్లా కలెక్టర్ వెంకట మురళి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటగా మరి కొంతమంది జిల్లా అధికారులు ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులంతా సహాపంక్తి భోజనం చేశారు. మనమందరం ప్రకృతిని ప్రేమిద్దాం కాపాడుదం అని ప్రతిజ్ఞ చేశారు.