బాపట్ల పట్టణం రైలుపేటకు చెందిన పోతన రాజ్యలక్ష్మి వైద్యఖర్చుల నిమిత్తం రూ.4లక్షల సీఎం సహాయ నిధి చెక్కును బుధవారం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆయన నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ ప్రైవేట్ వైద్యశాలల్లోచికిత్స పొందిన బాధితులు వారు చెల్లించిన రసీదులను సీఎం సహాయనిధికి దరఖాస్తు చేస్తే తక్షణమే ప్రభుత్వం నగదు చెల్లిస్తుందన్నారు. రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.