ఈనెల 30వ తారీఖు(శనివారం)ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ జిల్లా వ్యాప్తంగా చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎంపీడీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లు సమన్వయంతో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేయాలని ఆయన సూచించారు. సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.