కర్లపాలెం మండలం బుద్ధం గ్రామం వద్ద నిన్న జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ హరీష్ కుటుంబానికి, క్షతగాత్రులకు న్యాయం చేయాలని బంధువులు బుధవారం కర్లపాలెం గ్రామం ఐలాండ్ సెంటర్లో నిరసన చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని నిరసన విరమింప చేయాలని కర్లపాలెం పోలీసులు వారి కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు.