కర్లపాలెం మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం వల్ల గ్రామంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొలానికి వెళ్లే రైతులు, పనులు చేసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.