బాపట్ల మండల పరిధిలోని వెదుళ్ళపల్లి గ్రామం బదిరుల పాఠశాల వెనుక వైపు గల చెరువు సమీపంలో రాత్రుల సమయంలో భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రక్రియ చాలా రోజుల నుంచి కొనసాగుతుందని సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక తవ్వకాల పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.