కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరావు పాల్గొని మినుము పంట సంరక్షణకు తీసుకోవలసిన చర్యలను గురించి ఆయన రైతులకు వివరించారు. పంట సాగు దశలో విత్తన శుద్ధి చేయడం వలన పంట దిగుబడితో పాటు చీడ పురుగులను నివారించవచ్చని శ్రీనివాసరావు తెలియచేశారు. రైతులందరూ పొలంబడి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని అన్నారు.