బాపట్ల జిల్లా డిపిఓగా ప్రభాకరరావు నియామకం

67చూసినవారు
బాపట్ల జిల్లా డిపిఓగా ప్రభాకరరావు నియామకం
బాపట్ల జిల్లా పంచాయితీ అధికారిగా కేఎల్ ప్రభాకరరావు శుక్రవారం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లా నుంచి బాపట్ల బదిలీపై వచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు. జిల్లాలోని గ్రామపంచాయతీల అభివృద్ధికి , ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు జరిగేటట్లు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు. పలువురు కార్యాలయం సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్