కర్లపాలెం మండలం కొత్తనందయపాలెం గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు పల్లె పండుగ కార్యక్రమం జరిగింది. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు, గ్రామ సర్పంచ్ అట్ల వెంకటేశ్వరమ్మ , జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని రూ 10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఎంపీడీఓ ఏ. శ్రీనివాసరావు, ఈఓపిఆర్డి ఐ. శ్రీనివాసరావు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.