AP: ఆస్పత్రుల్లో మెడికల్ బిల్లులతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘వైద్య ఖర్చులు తగ్గాలి. వైద్యులకు ఆస్పత్రుల అభివృద్ధి ఎంత ముఖ్యమో.. సమాజ సేవా అంతే ముఖ్యం. అనవసరంగా రోగులను ఆస్పత్రులో ఉంచి బిల్లులు వసూలు చేసే విధానం మారాలి.’ అని అన్నారు.