చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ‘ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన’. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.3 వేలు ఇస్తారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాలి. ఒకవేళ రైతు మరణిస్తే అతని భార్యకు నెలకు రూ.1500 పింఛన్ ఇస్తారు.