Oct 25, 2024, 12:10 IST/కోరుట్ల
కోరుట్ల
ఘోర రోడ్డు ప్రమాదం
Oct 25, 2024, 12:10 IST
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్లా శివారులోని ఎల్లమ్మ ఆలయం సమీపంలో శుక్రవారం రోడు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనటంతో మెట్ పల్లి మండలం బండాలింగాపూర్ గ్రామానికి చెందిన పోతుగంటి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెల్లుల్లా గ్రామానికి చెందిన దండగుల స్వామీ పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాదు ఆసుపత్రి కి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావటంతో మెట్ పల్లి అసుపత్రికి తరలించారు.