TG: బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాల పోరాటం ఫలించింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో సెలవుల విషయంలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఊరట లభించింది. గతంలో బెటాలియన్ కానిస్టేబుళ్లు 15 రోజులకు ఒకసారి సెలవుపై వెళ్లే అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చింది. దీని ప్రకారం 26 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ మ్యాన్యువల్పై బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.