టెస్లా కారులో చెలరేగిన మంటలు.. నలుగురు భారతీయులు మృతి

67చూసినవారు
టెస్లా కారులో చెలరేగిన మంటలు.. నలుగురు భారతీయులు మృతి
కెనడాలోని టొరంటో సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోని గోద్రాకు చెందిన కేతా గోహిల్‌ (30), నిల్‌ గోహిల్‌ (26).. మరో ఇద్దరు వ్యక్తులతో టెస్లా కారులో ప్రయాణిస్తున్నారు. ఆ టెస్లా కారు డివైడర్‌ని ఢీకొట్టడంతో బ్యాటరీలు పేలి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్