Feb 10, 2025, 10:02 IST/
ఆర్ఎంపీ, పీఎంపీలపై వేధింపులు ఆపాలి: హరీశ్‌రావు
Feb 10, 2025, 10:02 IST
హైదరాబాద్‌లో గ్రామీణ వైద్యులు ధర్నా చేపట్టారు. RMP, PMPలపై మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలని, తమకు శిక్షణ తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా మాజీ మంత్రి హరీశ్‌రావు ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం RMP, PMPలను భయపెడుతోందని హరీశ్ అన్నారు. RMP, PMPలపై వేధింపులు ఆపాలని.. అక్రమ కేసులు ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. RMP, PMPలకు BRS అండగా ఉంటుందని హరీశ్ ప్రకటించారు.