ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. '42 మంది లోక్‌సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయి. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్. దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవు. నిందితులు ఏళ్లుగా విచారణకు రాకపోవడం జాప్యానికి మరో కారణం' అని అమికస్ క్యూరీ నివేదిక పేర్కొంది. క్రిమినల్ కేసులుంటే ఉద్యోగంలో చేరేందుకే అనర్హులు.. అదే ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.