చిలకలూరిపేట: జూన్ 15 వరకు తాగునీరు

68చూసినవారు
చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం గ్రీవెన్స్ సమావేశం జరిగింది. కమిషనర్ శ్రీహరిబాబు మాట్లాడుతూ మంచినీటి పైపులైన్ల లీకేజీలు ఒక నెలలో పూర్తి చేస్తామన్నారు. పట్టణంలో ఫిష్ మార్కెట్ కు కూడా టెండర్లు పిలిచారని అది కూడా పూర్తి చేస్తామని చెప్పారు. 2 చెరువులలో ఉన్న తాగునీరు పురపాలక సంఘ పరిధిలో జూన్ 15 వరకు వస్తాయని అన్నారు. ఏప్రిల్లో సాగర్ నుంచి తాగునీరు విడుదల చేస్తారన్నారు.

సంబంధిత పోస్ట్