చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గా ఎం. రాధాకృష్ణను నియమించారు. ఆదివారం పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి 50 నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను నియమించారు. ఈ నియామకాలలో భాగంగా పల్నాడు జిల్లా లోని చిలకలూరిపేట సమన్వయకర్త గా 2019, 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట శాసనసభా నియోజకవర్గం నుండి పోటీ చేసిన రాధాకృష్ణను నియమించారు.