వరద ప్రవాహ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

61చూసినవారు
వరద ప్రవాహ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
చిలకలూరిపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించారు. గడియార స్తంభం సెంటర్, కళామందిర్ సెంటర్, మార్కెట్‌ సెంటర్‌లో వరదనీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, డ్రైనేజీలు పరిశీలించి మున్సిపల్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం, పట్టణాల అభివృద్ధిని గాలికి వదిలేయడం తో ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోతోందన్నారు.

సంబంధిత పోస్ట్