చిలకలూరిపేట పట్టణానికి చెందిన పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఎంఆర్ ఫౌండేషన్అండగా నిలిచింది. పట్టణంలోని 6వ వార్డు ఎన్‌టిఆర్ కాలనీ 10వ లైనుకు చెందిన షేక్ సైదులు(లేటు), అమీనాబీ దంపతుల కుమార్తె షేక్ నాగూర్‌బీ వివాహం 2023 మే 4వ తేదీన నిశ్ఛయించారు. ఇంటి పెద్ద చనిపోవడం వలన యువతి వివాహం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నదన్న విషయాన్ని స్థానికుల ద్వారా ఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లెల రాజేష్‌నాయుడు తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన రాజేష్‌నాయుడు నాగూర్‌బీ పెళ్లి ఖర్చులకు తక్షణ సాయంగా ఆదివారం పదివేల రూపాయలు(రూ. 10, 000లు) ఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధుల ద్వారా అందజేశారు. అదేవిధంగా పెళ్లిరోజు భోజనాలకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని మల్లెల రాజేష్ నాయుడు పేద కుటుంబానికి భరోసా ఇచ్చారు. దీంతో మల్లెల రాజేష్‌నాయుడుకి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.