పల్నాడు ప్రజలందరికి సుఖసంతోషాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరి లోగిళ్లు సుభిక్షంగా ఉండాలని కోరుతూ సోమవారం శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి నుంచి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు రావాలని, ఇటువంటి విపత్తులు లేకుండా ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.