శ్రీశైలం దేవస్థానము నందు కాకతీయ అన్నదాన సత్రమునకు నూతనముగా అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, చిలకలూరిపేట విద్యా సంఘం అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు నియమితులైన సందర్భంగా మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నూతనంగా అధ్యక్షులుగా నియమితులైన తేళ్ల సుబ్బారావు ని ఘనంగా శాలువా వేసి, పూలమాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక కాకతీయ అన్నదాన సత్రానికి అధ్యక్షులుగా తేళ్ల సుబ్బారావు నియమితులైనందుకు ఎంతో సంతోషదాయకమని, గతంలో వారు చేపట్టిన ఎన్నో పదవులను కీర్తి ప్రతిష్టలు తెచ్చిన విధంగానే ఈ పదవి యొక్క ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, వివిధ హోదా ఉన్న నాయకులు, తమ శుభాకాంక్షలు తెలియజేశారు.