చీరాల: రోడ్డు ప్రమాదం కేసులో ఎస్.ఐ అరెస్టుకు సీఐ హామీ

55చూసినవారు
నిర్లక్ష్యంగా కారు నడిపి ఏ. ఆర్ ఏఎస్. ఐ సంపూర్ణ రావు మరణానికి కారకుడైన ప్రకాశం జిల్లా దొనకొండ ఎస్సై కే. విజయ్ కుమార్ ను వెంటనే అరెస్టు చేస్తామని చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు శుక్రవారం రాత్రి ప్రకటించారు. రోడ్డు ప్రమాదం కేసులో ఎస్సై విజయ్ కుమార్ ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మృతుడి కుటుంబ సభ్యులు రోడ్డు మీద ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఆయన అక్కడికి వచ్చి ఈ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్