చీరాలకు చెందిన డెలివరీ బాయ్ చిన్ను పై దాడి జరిగిన సంఘటన సోమవారం కారంచేడు మండలం స్వర్ణలో చోటుచేసుకుంది. డెలివరీ విషయమై మాటా మాట పెరగటంతో కస్టమర్ బాపూజీ డెలివరీ బాయ్ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో అతను చీరాల ఆసుపత్రిలో చేరారు. బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకొని అతని చూసేందుకు లోపలికి ప్రయత్నించడంతో వైద్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో వారు ఆందోళనకు దిగారు.