వేటపాలెంలో ఓ ట్యూషన్ మాస్టర్ పై ఆదివారం రాత్రి ఫోక్సో కేసు నమోదైంది. చల్లారెడ్డి పాలెంకు చెందిన ఆవుల వెంకటప్రసాద్ అనే వ్యక్తి ట్యూషన్లు చెబుతుంటాడు. ఈ క్రమంలో తన వద్ద ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చిన పదో తరగతి విద్యార్థినిని అతను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని తండ్రికి తెలియజేయగా అతని ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసినట్లు వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.